వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కి బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ దిమ్మ తిరిగే పంచ్!

Thursday, July 9th, 2020, 11:40:24 PM IST

వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి బీజేపీ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఏడాది కాలం గా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం వైపు కడులుతోంది అని, ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విద్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించే లోగా మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి అని అన్నారు.ఈ విపత్తు నుండి బీజేపీ ఎలా బయటపడుతుంది అనేది చూడాలి అని విజయ సాయి రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడం తో మరోసారి విజయ సాయి రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎంటి కన్నా తమరు అన్ని పార్టీల విషయాల్లో వేలు పెడతారు, లేస్తే మనిషిని కాదు అన్నట్లు లేఖస్త్రలు సంధించారు అని, మిడతల దండు బీజేపీ పై వాలింది అని వ్యాఖ్యానించారు చేస్తే తప్పా అని వ్యాఖ్యానించారు. అయితే విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దేవదర్ స్పందించారు. విజయ సాయి రెడ్డి కి దిమ్మ తిరిగే పంచ్ వేశారు. విజయ సాయి రెడ్డి కేవలం పసుపు రంగును మాత్రమే కాదు, అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీ కి ఉంది అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వలన ఫెడ్ అవుతున్న మీ పార్టీ రంగును కాపాడుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.