ఏపీకు రావడానికి ఎనలేని ఇక్కట్లు పడుతున్న హైదరాబాదీలు!

Wednesday, March 25th, 2020, 06:00:01 PM IST

కరోనా కారణంగా ఒక్కసారిగా ఈ దేశం అంతా స్తంభించిపోయింది. దీనితో ఎక్కడి ప్రజలు అక్కడే మిగిలిపోయారు. ఇదిలా ఉండగా బ్రతుకు తెరువు కోసం మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణా భాగ్య నగరంలో బ్రతుకు తెరువు కోసం ఎన్నో రాష్ట్రాలతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా అనేకం ఉన్నారు.

అసలు ఊహించిన పరిణామాలు జస్ట్ ఈ వారంలోనే మారిపోయిన పరిస్థితుల మూలాన హైదరాబాద్ హాస్టల్స్ లో ఇరుక్కుపోయిన ఆంధ్ర యకులు సరైన వసతులు లేక అందక దారుణమైన పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు.ఒకపక్క కరోనా మరోపక్క లాక్ డౌన్ ల మూలాన బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

లాక్ డౌన్ ల మూలాన హాస్టల్స్ లో ఎక్కడా తినడానికి ఆహరం లేకపోయే సరికి తమను తమ స్వస్థలాలకు చేర్చాలని రోడ్డెక్కి తెలంగాణా ప్రభుత్వానికి తమ ఘోడు వెళ్లగక్కుకుంటున్నారు.దీనిపై తెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఒకసారి చర్చించి వారిని ఆదుకుంటే మంచిది.అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ కింది వీడియో ద్వారా చూడండి.