బిగ్ న్యూస్ : ఏపీ అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలి.!

Thursday, February 6th, 2020, 09:01:05 AM IST

గడిచిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో వైసీపీ పార్టీకు 151 స్థానాలు వచ్చాయి.ఇది చరిత్రలో నిలిచిపోయే విజయమే..కానీ పాలన కూడా అదే స్థాయిలో హుందాగా ఉండాలి కదా అని ఇతర పార్టీల నేతలు ఇప్పుడు జగన్ పరిపాలనా విధానంపై తప్పు బడుతూ అందులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు.తాజాగా జగన్ తీసుకున్న మూడు రాజధానుల అంశంతోనే ఏపీ ప్రజలను మోసం చేసారని ఏపీపీసీసీ ఛైర్మెన్ తులసి రెడ్డి జగన్ పై సంచలన కామెంట్స్ చేసారు.

జగన్ ఎన్నికలకు ముందు రాజధానిని మారుస్తా అన్న విషయం ఎందుకు ప్రతిపాదించలేదని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు రాజధానిని ఎలా మారుస్తారని వ్యాఖ్యానించారు.జగన్ కానీ ఇదే అంశాన్ని ఎన్నికల ముందు ప్రస్తావించి ఉండి ఉంటే 151 కాదు కదా 21 స్థానాలు కూడా జనం ఇచ్చి ఉండేవారు కాదని ఈ విధంగా జగన్ ప్రజలను మోసం చేసినందుకు జగన్ భాద్యత వహిస్తూ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని తాజగా కడపలో జరిగినటువంటి వారి మీటింగులో తులసి రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు.