నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు సోలార్ వెలుగులు వచ్చేసాయ్…

Friday, March 9th, 2018, 06:42:37 PM IST

తెలంగాణా రాష్ట్రం, నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరైంది. ఈ మేరకు టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లేఖ రాశారు. 1000 మెగావాట్ల రైల్వే సోలార్ మిషన్‌లో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు సోలార్ ప్లాంట్‌ను మంజూరు చేయాలని గతేడాది మార్చి 14న అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఎంపీ కవిత లేఖ రాసిన విషయం విదితమే. ఎంపీ కవిత చేపట్టిన ఈ ఘనత ఇక నిజామాబాద్ చరిత్రలో నిలిచిపోతుందని నిజామాబాద్ ప్రాంతీయ వాసులు, రైల్వే స్టేషన్ అధికారులు ఆనందం వ్యక్తం చేసారు.