ఏపీ ఆర్టీసి బస్సులలో ఇక టికెట్ లెస్ ప్రయాణం సాధ్యం!

Friday, July 3rd, 2020, 06:30:23 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ను అరికట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. అయితే అదే తరహాలో ఆర్టీసి సైతం వేగం పెంచింది. కరోనా వైరస్ వ్యాప్తి ను అరికట్టడానికి నగదు రహిత లావాదేవీలను ఆర్టీసి ప్రోత్సహిస్తుంది. ప్రతం (pratham) అనే ఒక ఆప్ ను ఆగస్ట్ న లాంచ్ చేయనుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇక ఏ బస్సు టికెట్ ను అయిన బుక్ చేసుకోవచ్చు. పల్లె వెలుగు నుండి లగ్జరీ బస్సు కి సంబంధించిన టికెట్ లను సైతం బుక్ చేసుకోవచ్చు.

అయితే ఈ యాప్ ద్వారా టికెట్ లను బుక్ చేసుకోవడం ద్వారా ఒక అయిదు శాతం టికెట్ ధర లో రాయితీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దాన్ని అరికట్టేందుకు ఇలా నగదు రహిత లావాదేవీ లని ప్రోత్సహిస్తున్నాము అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఏపీ ఎస్ ఆర్టీసి అఫిషియల్ వెబ్ సైట్ ను సైతం అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ను అరికట్టడానికి ఉన్న ప్రతి మార్గం ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దంగా ఉంది.