వీడియో : ఆక్వామేన్ విజువ‌ల్ వండ‌ర్

Sunday, October 7th, 2018, 04:30:18 PM IST

3డి సినిమాల హ‌వా పెరిగింది. ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ సినిమాలు ఇండియా నుంచే 300కోట్లు సుమారుగా కొల్ల‌గొట్టేస్తున్నాయి. అస‌లు మ‌న నేటివిటీ, మ‌న హీరోల‌తో పనే లేకుండా ఇంగ్లీష్ సినిమాలు మ‌న‌పైన స‌వారీ చేస్తున్నాయి. 2018లో డ‌జ‌ను పైగానే హాలీవుడ్ చిత్రాలు వంద‌ల కోట్లు దోచుకెళ్లాయి. మునుముందు మ‌రిన్ని సినిమాలు వంద‌లు, వేల కోట్లు ఇండియా నుంచి దోచుకెళ్ల బోతున్నాయి.

ఈ దోపిడీలో ఈ ఏడాది చివ‌ర‌న రాబోతున్న మ‌రో విజువ‌ల్ వండ‌ర్ ఏ రేంజులో దోపిడీ సాగిస్తుందో అంచ‌నా వేసేందుకు ఇదిగో ఈ వీడియో చూస్తే చాలు. డిసెంబ‌ర్ 21న ఆక్వామేన్ – ఎక్స్‌టెండెడ్ మూవీ వ‌స్తోంది. అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ అంటే తెలుగు, త‌మిళ్‌, హిందీ అన్ని లోక‌ల్ భాష‌ల్లోకి అనువాద‌మ‌వుతోంది. 5.33 నిమిషాల నిడివితో భారీ వీడియోనే తాజాగా లైవ్‌లోకి తెచ్చారు. ఈ వీడియో మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్ తో హ‌త్తుకుంటోంది. ప్రస్తుతం యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.