అయ్యో రెహమాన్ కి మరొక ఆస్కార్ మిస్

Wednesday, January 25th, 2017, 11:06:57 AM IST

ar-rahman
ఏడు సంవత్సరాల క్రితం ఆస్కార్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు రెహమాన్ .. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకి కూడా తను గట్టి పోటీదారు అవుతాడు అని ఆయనతో పాటు అందరూ అనుకున్నారు. పీలే అనే సినిమాకి ఒరిజినల్ స్కోర్ , సాంగ్ విభాగాల్లో రెహమాన్ పోటీ పడ్డాడు. కానీ ఈ రెండింటా అతనికి నామినేషన్ కూడా దక్కకపోవడం గమనార్హం. తాజాగా ప్రకటించిన నామినేషన్ లలో రెహమాన్ పేరు లేదు.లెజెండరీ కంపోజర్ థామస్ న్యూమన్.. లా లా ల్యాండ్ సినిమాకు సంగీతాన్నందించిన జస్టిన్ హర్విట్జ్ లతో పాటు మరికొందరు ఈ విభాగాల్లో నామినేషన్లు పొందారు. ఒకటికి రెండు విభాగాల్లో రెహమాన్ పోటీ పడటంతో అందులో ఒక్క అవార్డయినా రెహమాన్ కు దక్కకపోదని అభిమానులు ఆశించారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటంతో రెహమాన్ నామినేషన్ సాధించలేకపోయాడు. 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు రెహమాన్ ఒకేసారి రెండు ఆస్కార్లు అందుకున్నాడు.