డిస్నీ ల్యాండ్‌లో బుల్లి ఐశ్వ‌ర్యం

Wednesday, July 11th, 2018, 03:51:52 PM IST

క్యూట్ క్యూట్ చ‌బ్బీ చ‌బ్బీ ఐశ్వ‌ర్యారాయ్ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? అచ్చం ఐష్‌నే త‌ల‌పించే ఈ భ‌విష్య‌త్ అతిలోక సుంద‌రి ప్ర‌స్తుతం విదేశాల్లో విహారానికి వెళ్లింది. ఈ విహారం ఎక్క‌డ అంటారా? హంస‌న‌డ‌క‌ల ప్యారిస్‌లో ఐష్ ప్ర‌స్తుతం విస్త్ర‌తంగా ప‌ర్య‌టిస్తోంది. ప్యారిస్‌లో ఈఫిల్ ట‌వ‌ర్ ముందు నిలుచుని ఐష్ ఫోజులిచ్చింది.

అంతేకాదు ఆరాధ్య బ‌చ్చ‌న్‌తో క‌లిసి ఏకంగా ప్యారిస్‌లోని డిస్నీల్యాండ్‌ని విజిట్ చేసింది. ఈ వీడియోని సోష‌ల్ మీడియాలో ఐశ్వ‌ర్యారాయ్ స్వ‌యంగా షేర్ చేయ‌డంతో ల‌క్ష‌లాది మంది వీక్షించారు. ఇప్ప‌టికీ ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ గ్రీన్ జాకెట్‌లో ఐష్ స్పెష‌ల్ గా క‌నిపిస్తే ఆరాధ్య స్ట్రిప్డ్ డ్రెస్‌లో క్యూట్‌గా క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments