నిర్మాతపై కేసు పెట్టిన అరవింద్ స్వామి ?

Friday, September 14th, 2018, 09:35:25 PM IST


తమిళ క్రేజీ నటుడు అరవింద్ స్వామి హీరోగా గ్యాప్ ఇచ్చిన తరువాత సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా మారాడు. విలన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అరవింద్ స్వామికి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది .. పైగా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి పెట్టుకుంటున్నారు. తాజాగా అరవింద్ స్వామి ఓ నిర్మాతపై కోర్టులో కేసు వేసాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి నటిస్తున్న చతురంగ వెట్టై 2 సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం అయన కోటి డెబ్భై లక్షలు ఒప్పుకున్నాడట. సదరు నిర్మాతకూడా ఆ రేట్ కు అందులో నటించాడు అరవింద్ స్వామి. సినిమా షూటింగ్ పూర్తీ కావొస్తున్నా కూడా నిర్మాత రెమ్యూనరేషన్ చెల్లించక పోవడంతో నిర్మాత మనోబాల పై కేసు పెట్టాడు. దాంతో కోర్టుకు విచారణ ఇవ్వాలంటూ విచారణ జరిపిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం వడ్డీతో మరి చెల్లించాలని కోర్టు ఆర్డర్ వేసింది. మరి ఈ నెల 20న జరిగే తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments