ప్రజలు కలిస్తే ఏదైనా సాధ్యమే – హీరో

Thursday, January 19th, 2017, 01:41:22 PM IST

aravind-swamy
జ‌ల్లిక‌ట్టుకి మ‌ద్ద‌తుగా చెన్న‌య్‌లోని మెరీనా బీచ్ వ‌ద్ద త‌మిళులు వ‌రుస‌గా మూడోరోజు పెద్ద‌ ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న‌కు ప‌లువురు సినీప్ర‌ముఖులు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఈ అంశంపై స్పందించిన సినీన‌టుడు అరవింద్‌స్వామి ప్రజలు జ‌ల్లిక‌ట్టుపై శాంతియుత మార్గంలో నిరసన చేపట్టడం గర్వంగా ఉందని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రజలంతా ఒక్కటైతే ఏమైనా సాధించవచ్చని, ప్రజా పోరాటానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ ఆందోళ‌న ప్రజల షో అని, ప్రజల విజయమని పేర్కొన్నారు. మ‌రోవైపు దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సమ్మేళనం జల్లికట్టుకు మద్దతుగా ఈ రోజు ఆందోళన నిర్వహిస్తామని తెలుపుతూ.. ఈ రోజు ఎటువంటి షూటింగ్‌లు జ‌రగవని చెప్పింది.