మొత్తానికి బయ్యర్స్ ని సేఫ్ చేసిన అరవింద ?

Tuesday, October 23rd, 2018, 03:58:51 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ భారీ విజయాన్ని అందుకుంది. ముక్యంగా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల వసూళ్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి రోజే 39 కోట్ల షేర్ రాబట్టిన చిత్రంగా సంచలనం రేపింది. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన వీర రాఘవ ఈ వీకెండ్ తో 150 కోట్ల వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డులు అందుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమా రెండో వారంలో కలక్షన్స్ తగ్గడంతో బయ్యర్స్ లాస్ అవుతారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా విషయంలో బయ్యర్స్ భారీగా రేటు పెట్టి థియేటర్స్ హక్కులు కొనేశారు. అయితే సెకండ్ వీకెండ్ లో కలక్షన్స్ తగ్గడంతో అంతా టెన్షన్ పడ్డారు కానీ తాజా మళ్ళీ పండగకు వసూళ్లు పెరగడంతో అందరు హ్యాపీ. 12 రోజులకు 150 కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం వేరే సినిమాలు ఏవి లేవు కాబట్టి ఈ వీకెండ్ కూడా అరవింద సమేత దే !!

  •  
  •  
  •  
  •  

Comments