“అజ్ఞ్యాతవాసి” రికార్డును టచ్ కూడా చేయలేకపోయిన “అరవింద సమేత”

Thursday, October 11th, 2018, 04:49:06 PM IST

జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త చిత్రం “అరవింద సమేత”తో భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలైన సంగతి తెలిసినదే.ఈ చిత్రం అన్ని చోట్లా రికార్డు స్థాయిలోనే విడుదలయ్యింది.దానితో అన్ని చోట్లా నాన్ బాహుబలి రికార్డులు నమోదు అవుతాయని అందరు అనుకున్నారు.భారతదేశంలో అంతటా ఎంత వసూలు చేసిందో రేపటి వరకు ఆగాల్సిందే కానీ ఓవర్సీస్ లో మాత్రం పవన్ కళ్యాణ్ యొక్క అట్టర్ ప్లాప్ చిత్రం “అజ్ఞ్యాతవాసి” దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

అజ్ఞ్యాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద గోరమైన పరాజయాన్ని చవి చూసినా పవర్ స్టార్ స్టామినాతో మొదటి రోజు మాత్రం అన్ని చోట్లా నాన్ బాహుబలి2 రికార్డులను నెలకొల్పింది.అదే విధంగా అమెరికా లో కూడా కేవలం ప్రీమియర్స్ తోనే దాదాపు 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసి నాన్ బాహుబలి 2 రికార్డును సృష్టించింది.ఆ చిత్రం తర్వాత ఎంతో మంది అగ్ర హీరోల చిత్రాలు విడుదలయ్యినా కూడా దాటలేకపోయాయి.కానీ ఈ సారి మాత్రం ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబో మాత్రం ఈ రికార్డును బద్దలు కొడుతుంది అని అందరు అనుకున్నారు కానీ ఈ చిత్రం వల్ల కూడా కాలేదు.అమెరికాలో అజ్ఞ్యాతవాసి ప్రీమియర్స్ తో 1.5 మిలియన్ డాలర్లు దక్కించుకోగా,అరవింద సమేత వీర రాఘవ మాత్రం 8 లక్షల డాలర్ల చేరువలో ఆగిపోయింది.కానీ చిత్రానికి మంచి టాక్ రావడంతో ఫుల్ రన్ లో మాత్రం బాగానే రాబట్టేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.