ఇంకా లీకుల టెన్షన్ లో అరవింద సమేత ?

Friday, September 7th, 2018, 10:57:51 PM IST

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తీ కావొచ్చిన ఈ సినిమాకు లీకేజీల టెన్షన్ మాత్రం తీవ్రంగా టెన్షన్ పెడుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోస్ లీక్ అయ్యాయి.

దాంతో టెన్షన్ పడ్డ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అయినా సరే .. ఈ సినిమాకు లీకులు టెన్షన్ మాత్రం తప్పడం లేదు .. తాజాగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కు సంబందించిన ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దాంతో ఈ సినిమా పై ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆసక్తి పెంచేస్తుంది. ఆసక్తి మాట ఎలా ఉన్న టీమ్ మాత్రం తలలు పట్టుకుంటున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని పాటలను ఈ నెల 20న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments