భారీ రేటుకు ‘అరవింద సమేత’ ఓవర్సీస్ హక్కులు?

Sunday, May 27th, 2018, 03:43:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధా కృష్ణ నిర్మిస్తున్న చిత్రం అరవింద సమేత, వీర రాఘవ అనేది కాప్షన్. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తో సినిమా చేస్తారా అని ఆయన అభిమానుల చూపులు మొత్తానికి ఫలించాయి. ఇప్పటికే భారీ స్థాయిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలోని తొలి షెడ్యూల్ లో తీసిన ఒక ఫైట్ ఇంతవరకు సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఎవరూ చిత్రీకరించలేదని అంటున్నారు. కేవలం ఫైట్ మీదనే కాదు, యావత్ చిత్రం పై దర్శకులు త్రివిక్రమ్ ఎంతో శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. అజ్ఞాతవాసి దెబ్బకు ఆయన తన పంథాను మార్చి మళ్లి పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎలెమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ చిత్ర హక్కులను ఓవర్సీస్ లోని ‘లా తెలుగు’ అనే సంస్థ దక్కించుకుందని యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర హక్కులను ఆ సంస్థ భారీ రేటుకు దక్కించుకుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వరుస హిట్లతో ఫామ్ లో ఉండడం, మరోవైపు త్రివిక్రమ్ కి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉండడం, వెరసి చిత్ర రైట్స్ ని ఆ స్థాయిలో కొనేలా చేశాయని చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం, రేపు విడుదల తర్వాత మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments