ప్రివ్యూ : “అరవింద సమేత వీర రాఘవ” ఎలా ఉందంటే.

Thursday, October 11th, 2018, 03:29:02 AM IST

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అరవింద సమేత వీర రాఘవ” రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.ఈ చిత్రం భారతీయ కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2 గంటలకు అమెరికాలో విడుదల కాబోతుంది.వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే 2 లక్షల డాలర్లు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

సెన్సార్ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం చిత్రం ఫస్టాఫ్ అంతా ఒక్కక్క పాత్రని పరిచయం చేసుకుంటూ,అక్కడక్కడా తారక్ మరియు పూజ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో సాగుతుందని,ఇక రెండో సగానికి వచ్చినట్టయితే భావోద్వేగాలతో కూడిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఈ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది.ఇప్పటికే చిత్ర దర్శకుడు ఈ చిత్రం కేవలం కథానుగుణం గానే నడుస్తుంది కానీ కావాలని తారక్ యొక్క స్థాయిని పెంచే సన్నివేశాలకు తావు ఇవ్వలేదని తెలిపారు.

నందమూరి వారి హీరోల్లో ఏ హీరోకి జరగని విధంగా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దాదాపు 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.ఇది తారక్ కెరీర్ లోనే రికార్డు అని చెప్పాలి.

ఈ చిత్రంలో ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ లో వచ్చేటువంటి పోరాట సన్నివేశాలు మాత్రమే ఉన్నట్టుగా అవి కూడా కథానుసారం ఉండేటట్టుగా ఉన్నాయని తెలుస్తుంది.ఈ చిత్రం దాదాపు 2 గంటల 46 నిముషాల నిడివిలో ఫస్టాఫ్ 1 గంట 30 నిమిషాలు గాను సెకండాఫ్ 1 గంట 16 నిమిషాలు గాను ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి తెల్లవారు జామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శనల కొరకు అనుమతిని ఇచ్చింది దీనితో మొదటి రోజు భారీ కలెక్షనే వస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం పడిన మొదటి ఆటతోనే మంచి టాక్ ను సంతరించుకోవడమే ఇక మిగిలి ఉంది… అమెరికాలో ప్రదర్శితం అవుతున్న ఈ చిత్రం యొక్క మొత్తం రివ్యూ కోసం ఇంకాస్త సమయం వేచి ఉండండి.