అరవింద సమేత కోసం ఎన్నికల సీన్ హైలెట్ ?

Wednesday, September 26th, 2018, 02:08:44 PM IST


క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరక్కేకుతున్న ఈ సినిమా వచ్చే నెల 11న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం ఎన్నికలకు సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ చెబుతుంది. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్క రాయలసీమ యాసలో మాటలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి అరవింద సమేత వీర రాఘవ అటు బిజినెస్ వర్గాల్లో ఓ రేంజ్ సంచలనం రేపెలా ఉంది.