అరవింద సమేతకు మిర్చి షేడ్స్ ?

Sunday, September 23rd, 2018, 01:26:51 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ఆడియో సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై రకరకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మరోవైపు. అదేమిటంటే .. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి తాలూకు షేడ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతుంది. కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రభాస్ తో తెరకెక్కించిన చిత్రం అప్పట్లో సంచలన విజయం అందుకుంది. పలనాడు నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా షేడ్స్ ఇందులోనూ కనిపిస్తున్నాయని .. అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం పెట్టారని తెగ ప్రచారం సాగుతుంది. మొత్తానికి ఇందులో నిజానిజాలు ఏమన్నదీ పక్కన పెడితే .. ఈ సినిమాపై వస్తున్నా నెగిటివ్ ప్రచారం పై టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేస్తున్నారు.