యూట్యూబ్ మీద మళ్ళీ యుద్ధానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్.!

Monday, October 1st, 2018, 08:40:32 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” చిత్రాన్ని ప్రకటించినప్పుడే అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.దానికి తోడు ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుంతుంది అని తెలియగానే మాస్ ఆడియోన్స్ లో కూడా అంచానాలు పెరిగిపోయాయి.అదే ఊపులో అరవిందుడి యొక్క టీజర్ ను ప్రేక్షకుల ముందు పెట్టగా యూట్యూబ్ లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో కూడా అందరికి తెలుసు.

ఇప్పటికి పాటలు,టీజర్ వంతు అయ్యిపోయింది.ఇక మిగిలి ఉన్నది ట్రైలర్ ఒక్కటి మాత్రమే అది ఎప్పుడెప్పుడా అని అభిమానులు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది.రేపు ఎలాగో అరవింద సమేత ప్రీ రిలీజ్ ను ఘనంగా జరపనున్నారు,అదే సమయంలో ఈ చిత్రానికి సంబందించిన టీజర్ని కూడా రాత్రి 8 గంటల 10 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు సమయాన్ని ఖరారు చేసేసారు.ఈ సారి ట్రైలర్ తో ఈ అరవిందుడు యూట్యూబ్ మీదకి వేటకి మొదలయ్యాడు.టీజర్ తోనే ఎన్నో ప్రకంపనలు రేపిన ఈ చిత్రం ట్రైలర్ తో ఇంకెన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ స్వరాలను అందిస్తున్నాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది.