సల్మాన్ సోదరుడి విడాకుల ఖరీదు 10 కోట్లు…?

Tuesday, December 27th, 2016, 03:35:27 PM IST

arbaaz-khan-and-malaika-aro
బాలీవుడ్ నటుడు, నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్భాజ్ ఖాన్, అతని భార్య మలైకా అరోరా విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరూ కౌన్సెలింగ్ కి కూడా హాజరయ్యారు. అయితే మలైకా మాత్రం విడాకులు ఇవ్వడానికి 10 నుండి 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అర్బాజ్ ఖాన్ కూడా డబ్బులు ఇవ్వడానికి అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం మలైకా అరోరాతోనే ఉంటున్నాడు. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వీళ్ళిద్దరూ మరలా కలిసి జీవించాలనుకున్నారని, దీనికి అర్భాజ్ ఖాన్ ఒప్పుకోగా మలైకా మాత్రం ఒప్పుకోలేదని పుకార్లు కూడా వచ్చాయి. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరాకు 1998 లో వివాహం జరిగింది. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలోనే వీళ్ళు చెప్పారు. ఈ విషయంపై అర్భాజ్ ఖాన్ సోదరుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.

  •  
  •  
  •  
  •  

Comments