ఆర్భాజ్ వ్య‌క్తిగ‌త జీవితం గుట్టు లీక్‌!

Tuesday, June 5th, 2018, 09:42:59 AM IST

బాలీవుడ్ న‌టుడు, నిర్మాత ఆర్భాజ్‌ఖాన్ ఐపీఎల్‌లో బెట్టింగుకు పాల్ప‌డి విచార‌ణ ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ‌లో అత‌డి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌పైనా పోలీస్ విచార‌ణ సాగుతోంది. బుకీల‌తో అత‌డు నెరిపిన సంబంధాల‌పై డీటెయిల్డ్‌గా వెళుతోంది క్రైమ్ బ్రాంచ్‌. ఆ క్ర‌మంలోనే అత‌డి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ప‌లు వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌కు లీక‌య్యాయి.

2016లో ఆర్భాజ్ నుంచి మ‌లైకా విడిపోవ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు చెప్పుకున్నారు. అయితే ఆర్భాజ్‌లోని ఆర్థిక అస్థిర‌తే మ‌లైకా దూర‌మ‌వ్వ‌డానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. బెట్టింగుల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని మ‌లైకా భ‌ర్త‌ను వారించే ప్ర‌య‌త్నం చేసినా ఏమాత్రం ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఆర్భాజ్ సోద‌రుడు స‌ల్మాన్‌, తండ్రి స‌లీమ్ ఖాన్ సైతం ఆర్భాజ్‌కి అడ్డుక‌ట్ట వేయాల‌ని చూసి విఫ‌ల‌మ‌య్యారు. త‌ప్పుడు మార్గాల్లో డ‌బ్బు సంపాద‌న వ‌ద్ద‌ని చెప్పినా అత‌డు విన‌లేదు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు బుకీలు పోలీసుల‌కు గుట్టు లీక్ చేయ‌డంతో త‌నే నేరాన్ని అంగీక‌రించాల్సి వ‌చ్చింది. 2.8 కోట్ల మేర బెట్టింగుల్లో పోగొట్టుకున్న ఆర్భాజ్ .. ఆ విష‌యంలో బుకీల‌తో గొడ‌వ‌ప‌డ‌డం వ‌ల్ల‌నే అస‌లు సంగ‌తి లీకైన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments