ప్ర‌యివేటు ట్రావెల్స్‌లో ప‌య‌నం.. ప్రాణాల‌కు నో గ్యారెంటీ!

Friday, February 10th, 2017, 10:53:03 AM IST


జ‌ర్నీ సినిమా చూశారా? చూడ‌లేదా? అయితే ప్ర‌యివేటు ట్రావెల్స్ టిక్కెట్టు కొని బ‌స్సు ఎక్కి చూడండి. ఆ డ్రైవ‌ర్ చూపిస్తాడు మీకు జ‌ర్నీ సినిమా. మీ ప్రాణాలు గాల్లో ఎప్పుడు తేల్తాయో తెలీని ఆగ‌మ్య‌గోచ‌ర ప‌య‌నం ప్ర‌యివేటు ట్రావెల్స్‌తోనే…

గ‌త్యంత‌రం లేక నిత్యం వేలాది మంది ప్ర‌యాణీకులు ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సుల్ని ఎంచుకుని రాష్ట్రాలు, స‌రిహ‌ద్దులు దాటుకుని గమ్య‌స్థానాల‌కు వెళ్లాల్సొస్తోంది. ప్ర‌భుత్వ క‌ట్ట‌డి లేని, నియ‌మ‌నిబంధ‌ల్లేని రీతిలో ఈ బ‌స్సుల్ని న‌డుపుతూ ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతాయో తెలీని ఆగ‌మ్య‌గోచ‌రంలో ప్ర‌యివేటు ట్రావెల్సే దిక్కు మొక్కు అంటూ ప్ర‌యాణీకులంతా ఆధార‌ప‌డిపోతుంటారు. నిత్యం హైద‌రాబాద్ స‌హా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను క‌లుపుకుని ప్ర‌యాణించే ఈ ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సుల్లో ప‌య‌నం ఎంత‌వ‌ర‌కూ సేఫ్ అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. డ్రైవార్ అవ్వాలంటే అందుకు కొన్ని అర్హ‌త‌లు ఉండాలి. ఏ అర్హ‌తా లేని వాళ్లు డ్రైవింగ్ తెలుసంటూ బ‌స్సు న‌డిపితే అటుపై జ‌ర‌గ‌కూడ‌నిది జ‌రిగితే అందుకు బాధ్యులు ఎవ‌రు? వ‌ంద‌ల ప్ర‌యాణీకుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోతే స‌ద‌రు ప్ర‌యివేటు యాజ‌మాన్యం ప‌ట్టించుకుంటుందా? పోయిన ప్రాణాల్ని తిరిగి తెస్తాయా? ఏమో.. నిత్యం అమీర్‌పేట్ స‌హా హైద‌రాబాద్ ప‌రిస‌రాల నుంచి వేలాదిగా మంది ప్ర‌యాణీకులు, వంద‌ల సంఖ్య‌లో ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌య‌ల్దేరుతుంటాయి. ఇంటికి చేరేవ‌ర‌కూ దేవుడే దిక్కు.

తాజాగా ఓ డ్రైవ‌ర్ త‌ప్ప‌తాగి బ‌స్సు స్టార్ట్ చేశాడు. అటుపై మార్గ‌మ‌ధ్యంలోనే ఓ డివైడ‌ర్‌ని ఢీకొట్టాడు. కొద్దిలో మిస్ కానీ ప్ర‌యాణీకుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవే. స‌ద‌రు డ్రైవ‌ర్‌ని పోలీసులు ప‌ట్టుకుని శంక‌ర‌మాన్యాలు ప‌ట్టించారు. హైద‌రాబాద్ నుంచి బ‌య‌ల్దేరిన భార‌తీ ట్రావెల్స్‌కి చెందిన ఓ బ‌స్సు డ్రైవ‌ర్ త‌ప్ప‌తాగి హయ‌త్‌న‌గ‌ర్ ఏరియాలో ఓ డివైడ‌ర్‌ని ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జ‌స్ట్ మిస్‌. అందులో ఉన్న దాదాపు 50 మంది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవే. పోలీసులు స‌ద‌రు డ్రైవ‌ర్‌ని బ్రీత్ అన‌లైజ‌ర్‌తో చెక్ చేసి బాగా తాగి ఉన్నాడ‌ని తేల్చారు. ఇప్పుడు చెప్పండి ప్ర‌యివేటు ట్రావెల్స్ డ్రైవ‌ర్లు త‌ప్ప తాగ‌ర‌ని గ్యారెంటీ ఏంటి? ప‌్ర‌యాణీకుల ప్రాణాల్ని మ‌ధ్య‌లోనే గాల్లోకి లేపేయ‌ర‌ని గ్యారెంటీ ఏంటి? య‌మ‌లోకానికి దారేది అంటూ న‌ర‌కానికి దారి చూపించ‌డ‌ని గ్యారెంటీ ఏంటి?