‘జనతా గ్యారేజ్’ కలెక్షన్స్‌ దొంగ లెక్కలా?

Saturday, September 17th, 2016, 09:58:38 PM IST

janatha-garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ హీరో అన్న పేరే కానీ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా వరకూ ఆయనకు ఒక్క 50 కోట్ల రూపాయల షేర్ సాధించిన సినిమా కూడా ఉండేది కాదు. నాన్నకు ప్రేమతో కూడా సరిగ్గా 50కి అటూ ఇటుగా ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తన ఆశలన్నీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారెజ్ పైనే పెట్టుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ ఆశలను నిజం చేస్తూ కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కెరీర్‌కే అతిపెద్ద హిట్ ఇచ్చాడు. 50 కోట్ల మార్కే ఓ కష్టంగా తయారైన ఎన్టీఆర్ కెరీర్‌కు కొత్త వెలుగులా జనతా గ్యారేజ్ వసూళ్ళ వర్షం కురిపించింది.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైనే షేర్ వసూలు చేసిందని టీమ్ కూడా చెప్పేసింది. అయితే అభిమానులు ఈ విషయాన్ని బాగానే ప్రచారం చేసుకుంటున్నా, ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం జనతా గ్యారేజ్‌వి అన్నీ దొంగ లెక్కలనీ, సినిమాకు నిజంగా అన్ని కలెక్షన్స్ రాలేదని పుకార్లు పుట్టించారు. దీంతో గత వారం రోజులుగా జనతా గ్యారేజ్ కలెక్షన్స్ నిజమైనవేనా? ఫేక్ ఆ? అన్న దానిపై సోషల్ మీడియాలో ఆగకుండా ప్రచారం జరుగుతోంది. దీంట్లో ఒక్కొక్కరిదీ ఒక్కో మాట అయినా చివరగా వచ్చిన తీర్పైతే కలెక్షన్స్‌లో కొంచెం ఎక్కువ చూపించి ఉండొచ్చేమో కానీ, సినిమా అయితే టాప్ సినిమాల్లో ఒకటన్నది ఒప్పుకోక తప్పదని తేలింది.