ఆర్ యు ఎ ఉమెన్ ఆర్ కాక్‌టైల్‌? ఎమీపై ఫ్యాన్ బాణం!!

Thursday, March 22nd, 2018, 09:24:22 PM IST

లేడీ రోబోట్‌, సూప‌ర్‌గాళ్‌ ఎమీజాక్స‌న్ కి అభిమాని నుంచి ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది. ఇంకా చెప్పాలంటే దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న‌నే ఎదురైంద‌ని చెప్పాలి. ఆర్ యు ఎ ఉమెన్ ఆర్ కాక్‌టైల్‌? అంటూ ప్ర‌శ్నించాడో వీరాభిమాని. అస‌లింత‌కీ అంత‌గా ప్ర‌శ్నించేంత సంద‌ర్భం ఏం వ‌చ్చింది? అంటే.. డీటెయిల్స్‌లోకి వెళ్లాలి.

ఎమీజాక్స‌న్ గ‌త కొంత‌కాలంగా వేడెక్కించే వార్త‌ల‌తో స‌మ్మ‌ర్ హీట్‌ని రెట్టింపు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ బిజినెస్ మ్యాగ్నెట్ కం బోయ్‌ఫ్రెండ్ ని తొంద‌ర్లోనే పెళ్లాడేయ‌బోతోందంటూ వార్త‌లొచ్చాయి. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు ఈరోజు ట్విట్ట‌ర్‌లో మ‌రో వేడెక్కించే సీక్రెట్‌ని లీక్ చేసింది. ఒకే ఒక్క ట్వీట్ ఫ్యాన్స్‌లో హీట్ ర‌గిలించింది. “నా డీఎన్ఏ పూర్వాప‌రాలు తెలిశాయి. నా రూట్స్ 12 శాతం పోర్చుగీస్‌-ఐబీరియ‌న్ పెన్సులాలో, 4 శాతం అమెరికాలో, 5 శాతం సౌత్ ఆసియాలో ఉన్నాయ‌ని తేలింది. ఈ రిపోర్టుతో నా బుర్ర తిరిగిపోయింది. దీనిపై సీరియ‌స్గా ప‌రిశోధించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది“ అంటూ ట్వీట్ చేసింది. ఇలా ఈ పోస్టింగ్ పెట్టిందో లేదో అట్నుంచి అభిమానుల్లో ఒక‌టే ప్ర‌కంపనాలు. అదిరిపోయే రిప్ల‌య్‌లు వ‌చ్చి ప‌డ్డాయ్‌! “ఆర్ యు ఎ ఉమెన్ ఆర్ కాక్‌టైల్‌?“ అంటూ ఒక అభిమాని చిలిపి ప్ర‌శ్న వేస్తే, 21 శాతం డీఎన్ఏ వివ‌రం తెలిసింది స‌రే.. మిగ‌తా డీఎన్ఏ ఏ దేశంలో? అంటూ ప్ర‌శ్నించాడో కొంటె అభిమాని. స్పేస్‌లోనూ ఉందేమో చెక్ చేస్కో! అంటూ ఇంకొక‌డు ట్వీట్ చేశాడు. మొత్తానికి ఎమీ జాక్స‌న్‌కి మైండ్ బ్లాక్ అయ్యే సెటైర్లు, పంచ్‌లే ప‌డ్డాయ్‌! ఇంకెప్పుడూ ఆసియాతో ముడిపెడుతూ లేదా ఇండియాతో ముడిపెడుతూ డీఎన్ఏ టెస్టులు చేయించుకోవ‌ద్ద‌ని కొంటెగా వార్నింగ్ ఇచ్చార‌నుకోవ‌చ్చు!