హాట్ ఆంటీతో కుర్ర‌హీరో ఎఫైర్ గోల‌

Saturday, September 1st, 2018, 11:13:39 PM IST


బాలీవుడ్ యువ‌హీరో అర్జున్ క‌పూర్ – మ‌లైకా అరోరాఖాన్ ఎఫైర్ గురించి తెలిసిందే. 40ప్ల‌స్ మ‌లైకా.. ఈ కుర్ర‌హీరో అంటే ప‌డి చ‌స్తుంది. ఫ్యాష‌న్, క‌ల‌ర్‌ఫుల్‌ వ‌ర‌ల్డ్‌లో ప‌రిచ‌యం కాస్తా ఎఫైర్‌గా మారింద‌న్న‌ది అప్ప‌ట్లో ఓ అభియోగం. ఇటీవ‌లే భ‌ర్త ఆర్భాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చేసిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఫ్యాష‌న్ ఈవెంట్లు, లైవ్ షోల‌తో బిజీ అయిపోయింది. ఎప్ప‌టికప్పుడు ర్యాంప్ వాక్‌ల‌తో, ఫోటో షూట్ల‌తో వేడెక్కిస్తూనే ఉంది. లేటు వ‌య‌సులో ఘాటు ఫోజుల‌తో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది.

ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ప‌లు ఈవెంట్ల‌లో అర్జున్ క‌పూర్‌తో క‌లిసి మ‌లైకా హ‌ల్‌చ‌ల్ చేస్తూ క‌నిపించింది. దీంతో మ‌రోసారి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం బ‌ల‌ప‌డుతోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. లేటు వ‌య‌సు మ‌లైకా కుర్ర‌హీరోకి మ‌రింత ద‌గ్గ‌రైపోతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌ఖ్యాత టైమ్స్ న‌వ్ న్యూస్, హిందూ, ఎన్డీటీవీల్లో ఈ ఇద్ద‌రి క్లోజ్‌నెస్‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు లైవ్ అయ్యాయి. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత బ్రైడ్స్ టుడే ఫోటోషూట్‌లో ఆ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డంతో ఈ పుకార్లు మ‌రింత ఉధృతం అయ్యాయి.

  •  
  •  
  •  
  •  

Comments