అర్జునరెడ్డి గా అర్జున్ ?

Tuesday, January 16th, 2018, 04:15:28 PM IST

ఆ! ఆ! కంగారుపడకండి అర్జున్ రెడ్డి సినిమా ఆల్రెడీ తెలుగు లో వచ్చిందికదా మళ్లి అల్లు అర్జున్, అర్జున్ రెడ్డిగా చేయడం ఏంటా అనుకోకండి. అసలు సంగతి ఏంటంటే, మన తెలుగు లో విజయ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద ఘాన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా రీమేక్ హక్కులు మంచి ధరకే అమ్ముడు పోయాయి. ఈ చిత్రాన్ని తమిళ్ లో ప్రముఖ నటులు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ తన సినిమా అరంగేట్రం చేస్తున్నారు. దీనికి బాల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం ప్రముఖనటి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ల తనయుడు అర్జున్ కపూర్ నటించనున్ననట్లు తెలుస్తోంది. అయితే తెలుగు వర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తోన్నట్లు, స్వయంగా హీరో అర్జున్ కపూర్ దీనికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తెలుగులో యువతను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుని విజయ్ దేవరకొండకి మంచి బ్రేక్ ఇచ్చిన ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో ఎటువంటి ఫలితాన్ని పొందుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచిచూడాల్సిందే…