ముద్దుల విషయంలో టెన్షన్ ఎందుకంటున్న భామ ?

Sunday, December 3rd, 2017, 02:49:46 PM IST

అర్జున్ రెడ్డ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలో ఏకంగా డజన్ కు పైగా ముద్దు సన్నివేశాల్లో నటించి షాకిచ్చిన హీరోయిన్ షాలిని పాండే .. కు ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో దూసుకుపోవచ్చని ఆశించింది .. కానీ పరిస్థితి దానికి బిన్నంగా మారడంతో .. కోలీవుడ్ లో అవకాశం కొట్టేసింది. 100 పర్సెంట్ లవ్ సినిమా తమిళ రీమేక్ లో నటిస్తున్న ఈ భామకు అక్కడ వరుస అవకాశాలు క్యూ కట్టాయి .. ఇప్పటికే మరో రెండు తమిళ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాలిని పాండే .. అర్జున్ రెడ్డి సినిమాలో వరుస లిప్ లాక్ ల గురించి మాట్లాడుతూ .. ముద్దుల విషయంలో ఎందుకు టెన్షన్ .. అదికూడా ఓ చర్య లాంటిదే .. మనం ఎలా నవ్వుతామో, ఎలా ఏడుస్తామో.. ముద్దులు కూడా అంతే అది ఓ ఎమోషన్ లాంటిదే అంటూ సమాధానం చెప్పి షాకిచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో ఆ పాత్రకే ముద్దు పెట్టానని .. అక్కడ విజయ్ ని ఉహించుకోలేదని చెప్పింది. నేను అందరిలాంటి అమ్మాయిని కానని చెప్పిన ఈ భామ అవసరం అయితే బికినీ కూడా వేస్తానని చెప్పింది. మొత్తానికి అర్జున్ రెడ్డి భామ కు అన్ని విషయాల్లో పక్కా క్లారిటీతో ఉందిగా !!

  •  
  •  
  •  
  •  

Comments