కూతురు ప్రేమకథను .. తండ్రి చెబుతాడట !!

Saturday, January 21st, 2017, 01:26:34 PM IST

arjun
సౌత్ లో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ .. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో పాటు మరో వైపు విలన్ పాత్రలు చేస్తూ బిజీగా మారాడు. అలాగే అప్పుడప్పుడు దర్శకత్వం చేస్తూ ఆ విభాగంలో కూడా తన టాలెంట్ నిలుపుకున్నాడు. ఇక హీరోగా కెరీర్ క్రేజ్ తగ్గడంతో సపోర్టింగ్ రోల్ పోషిస్తూ రీ ఎంట్రీ ఇచ్చిన అయన ఇప్పుడు మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సారి యాక్షన్ సినిమాతో కాకుండా మంచి ప్రేమకథతో సినిమా చేస్తున్నాడు. ఇందులో మరో విశేషం ఉంది .. అదేమిటో తెలుసా ! ఈ సినిమాలో హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య నటిస్తుందట !! మొత్తానికి కూతురి ప్రేమకథను తండ్రి రూపొందించడంతో ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఆసక్తి నెలకొంది. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఇంతకుముందే కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కానీ, ఆమెకు కమర్షియల్ గా సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఆమెకు ఓ మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలని ఆమె తండ్రి అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో హీరోగా కన్నడ నటుడు చేతన్ కుమార్ హీరోగా కనిపిస్తాడట, మరి రొమాంటిక్ సన్నివేశాలను తన కూతురితో అర్జున్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.