షాక్‌ : అర్జున్‌రెడ్డికి రెబ‌ల్‌ బ్ర‌ద‌ర్‌?

Monday, May 28th, 2018, 10:03:04 AM IST

తీక్ష‌ణంగా చూడ‌డం.. న‌చ్చిన‌ట్టు మాట్లాడేయ‌డం.. మ‌న‌సులో ఉన్న‌ది క‌క్కేయ‌డం.. డ్ర‌గ్స్‌.. ఆల్క‌హాల్ .. ఏదైనా ప‌బ్లిగ్గా తీసుకోవ‌డం.. ఇలాంటి యారొగెన్సీ క్యారెక్ట‌ర్‌ని ఎక్క‌డైనా చూశారా? ఎస్‌.. అర్జున్‌రెడ్డి చిత్రంలో చూశాం క‌దూ? ఆ పాత్ర‌లో పెళ్లి చూపులు ఫేం విజ‌య్‌దేవ‌ర‌కొండ చేసిన పెర్ఫామెన్స్ వేరొక‌రు చేయ‌గ‌ల‌రో లేదో తెలీదు కానీ, ఆ క్యారెక్ట‌రైజేష‌న్ మాత్రం అత‌డికోస‌మే పుట్టిందా? అన్న‌ట్టు సెట్ట‌య్యింది. అర్జున్ రెడ్డి లోని విల‌క్ష‌ణ‌త‌, వైవిధ్యం తెలుగు ప్రేక్ష‌కుల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. యారొగెంట్ అయితే ఏంటి? ఆల్క‌హాలిక్ అయితే ఏంటి? అత‌డి ప్రేమ‌లోని స్వ‌చ్ఛ‌త‌ను అవేవీ డ్యామేజ్ చేయ‌లేదు. అందుకే ఆ పాత్ర అంత ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట‌య్యింది.

ఇప్పుడు అర్జున్‌రెడ్డి 2కి కూడా క‌థ రెడీ అవుతోంది. అయితే ఈ రెండో భాగంతో త‌మ్ముడు రెడ్డిని కూడా దేవ‌ర‌కొండ ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే ఈ ఫోటో సంకేతాలిస్తోంది. అన్న‌ను మించిన రెబ‌లిజం ఆ త‌మ్ముడిలో కూడా క‌నిపిస్తోంది. డ్యామ్ షిట్ ఆల్క‌హాలిక్ బ్రో పాత్ర‌తో ఇంట్ర‌డ్యూస్ చేస్తే బావుంటుందేమో?

  •  
  •  
  •  
  •  

Comments