ట్రెండీ టాక్‌ : అర్జున్‌రెడ్డి వ‌ర్సెస్ వ‌రుణ్ ధావ‌న్‌?!

Wednesday, January 10th, 2018, 03:53:17 PM IST

`అర్జున్ రెడ్డి` సినిమాతో స్కైని ట‌చ్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఒక అప్‌క‌మ్ హీరో న‌టించిన సినిమా ఏకంగా ఇంటా బ‌య‌టా రికార్డులు తిర‌గ‌రాస్తూ 50 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మంటే ఆషామాషీనా? ఓ ర‌కంగా విజ‌య్ దేవ‌ర‌కొండ జాత‌క‌మే మార్చేసింది ఈ సినిమా. స్టార్ హీరోల రేంజుకే చేర్చింది. అంత‌టి మ్యాట‌రుంది కాబ‌ట్టే ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ ఈ సినిమా రీమేక్‌ల కోసం వెంప‌ర్లాడుతున్నారు. త‌మిళ రీమేక్‌ని చియాన్ విక్ర‌మ్ న‌ట‌వార‌సుడు ధృవ్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా హిందీ రీమేక్ కోసం హీరోని ఫైన‌ల్ చేయ‌డం విశేషం. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌కి కుర్ర హీరో వ‌రుణ్ ధావ‌న్‌ని ఫైన‌ల్ చేశారు. జుడ్వా 2 వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో ధావ‌న్ య‌మ‌స్పీడుమీదున్నాడు. ఆ చిత్రంలో ద్విపాత్రాభిన‌యంతో అద‌ర‌గొట్టేసిన ధావ‌న్ పెర్ఫెక్ట్ ఆప్ష‌న్ అన్న టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి ఈ పాత్ర‌కు తొలుత షాహిద్ క‌పూర్‌, ర‌ణ‌వీర్ సింగ్ వంటి హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఆ ఇద్ద‌రి నుంచి దూర‌మై .. ఇప్పుడు ధావ‌న్ కోర్టులోకి వ‌చ్చింది బంతి. మొత్తానికి చేరాల్సిన చోటికే స్క్రిప్టు చేరింది. ఆల్క‌హాల్, డ్ర‌గ్స్ వంటి వాటిని సేవించే రెక్ల‌స్ డాక్ట‌ర్ గా వ‌రుణ్ ధావ‌న్ న‌టించ‌నున్నాడు. వ‌రుణ్ ధావ‌న్ పెర్ఫెక్ట్ యాప్ట్ రోల్ ఇది. ఈ చిత్రానికి `జుడ్వా 2` ఫేం సాజిద్ న‌డియావాలా నిర్మించ‌నున్నారు. సందీప్ రెడ్డి వంగా ఇప్ప‌టికే అర్జున్‌రెడ్డి హిందీ స్క్రిప్టును రెడీ చేశారు. ద‌ర్శ‌కుడెవ‌రు? క‌థానాయిక ఎవ‌రు? అన్న‌ది ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.