కరుడు కట్టిన ఉగ్రవాది ఎస్కేప్.. హైఅలర్ట్ ప్రకటించిన కేద్రం..!

Sunday, November 27th, 2016, 05:23:53 PM IST

kasab
ఆయుధాలతో వచ్చిన పది మంది దుండగులు పంజాబ్ లోని నాబా జైలు పై దాడిచేసి కారుడు కట్టిన ఉగ్రవాదిని నలుగురు మిలిటెంట్లని విడిపించుకుని పారిపోయారు. జైలు గార్డుని కత్తితో గాయ పరచిన వీరు జైలు లోనికి దూసుకుని పోయారు. జైలు సిబ్బంది పై వంద రౌండ్ల కాల్పులు జరపగా.. ఇద్దరు జైలు అధికారులు గాయపడినట్లు తెలుస్తోంది.జైలులో ఉన్న ఖలీఫీస్థాన్ చీఫ్ హార్మిందర్ సింగ్ ని, మరో నలుగురు ఉగ్రవాదులను దుండగులు విడిపించుకుని పోయారు. ఈ ఘటన తో కేంద్రప్రభుత్వం ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో కేంద్రం హై అలర్ట్ ని ప్రకటించింది.

దీనితో రంగంలోకి దిగిన పోలీస్ లు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. జైలు వద్ద నిఘా పెట్టటడం లో విఫలమైన జైలు అధికారిని ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. పరారైన హార్మిందర్ సింగ్ పై 10 వరకు ఉగ్రవాద సంబంధ కేసులు ఉన్నాయి. అతనిని పోలీస్ లు 2014 ఢిల్లీ విమానాశ్రయం లో అరెస్టు చేశారు. అత్యంత భద్రత ఉన్న నాబా జైలు నుంచి ఉగ్రవాది పారిపోవడంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.