యుద్ధానికి ప్రిపేర్ అవుతున్న ఇండియన్ ఆర్మీ !

Sunday, November 13th, 2016, 06:22:29 PM IST

army
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాల పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకంటే భారీస్థాయిలో సర్జికల్ స్ట్రైక్స్ లేదా యుద్ధమే చేయాల్సి వచ్చినపుడు అనుసరించాల్సిన వ్యూహాలకోసం ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ ని చేపట్టాయి.’హెలిబోర్న్ ఆపరేషన్’ పేరుతో రెండురోజులపాటు సాగే సన్నాహకాలు నేడు జైసల్మేర్ ప్రాంతంలో మొదలయ్యాయి.

అనుకోకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ నష్టంతో శత్రువులపై ఎలా దాడి చేయాలి అన్న దానిపై ఈ విన్యాసాలు కృత్రిమ యుద్దవాతావరణం లో అధికారుల పర్యవేక్షణ లో జరుగుతున్నాయి. యుద్ధ హెలికాఫ్టర్లు, సుదూర లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలు ఈ ఆపరేషన్ కోసం వాడారు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఆపరేషన్ లో తెలుసుకుంటారు.

ఫోటోల కోసం క్లిక్ చేయండి