బ్రేకింగ్ వీడియో : సినిమా హాల్ లో అవమానం.. కన్నీటి సంద్రంలో హరితేజ

Friday, May 18th, 2018, 06:13:32 PM IST

హరితేజ.. అ..ఆ.. సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకుని, బిగ్ బాస్, షోతో అందరూ గుర్తు పట్టేలా స్టార్డం క్రియేట్ చేస్కుంది. అటు చిన్న చిన్న షోలలో యాంకరింగ్ చేస్తూ ఏ సినిమా అయినా సరే మంచి పాత్ర వస్తే చాలు అని వచ్చిన ఎప్పుడూ ఎదో ఒక రోల్ ప్రయత్నిస్తూనేర్ ఉంటుంది. నటనలోనే కాకుండా డ్యాన్సు, మరియు వివిధ కార్యకలాపాల్లో కూడా ఎప్పుడూ చలాకీగా ఉంటూ గంతులు వేస్తుంది. అయితే ఇటివల పలు ప్రాజెక్టుల్లో యాక్టింగ్ చేస్తూ బిజీ అయిపోయిన హరితేజ కాస్త సమయం దొరకగానే ఫ్యామిలీకో కలిసి మహానటి సినిమాకు వెళ్ళింది.ఫస్ట్ హాల్ఫ్ లో తన చెల్లి పక్కన కూర్చొని సినిమా చూస్తున్న హరితేజ ఎందుకో మనసు కుదుట పదాలని సెకండ్ హాల్ఫ్ లో ఆమె అమ్మ పక్కన కూర్చుందామని వాళ్ళ నాన్నని అటు పక్క సీటులో కూర్చోమని చెప్పిందట. అదే సమయంలో ఆ పక్కన ఓ మహిళా కూర్చొని ఉండగా ఆమె పక్కన ఆమె అమ్మాయి కూడా కూర్చొని ఉందట. సీటు మార్చుకోవడానికి అభ్యంతరం చేసిన ఆ మహిళా తన పని తానూ చూసుకోక అసభ్యకరంగా మాట్లాడుతూ మేము మీ సినిమా వాళ్ళలాగా ఎవరిపక్కన పడితే వారి పక్కన, ఎలా పడితే అలా కూర్చోమని ఓ మాట అనేసిందట. ఆ మాట విన్న హరితేజ సినిమా హాల్ లోనే పల్లున ఏడ్చేసిందట. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఏడుస్తూ బయట పెట్టింది.