ఎపికి ఇప్పటికే చాలా అందించాం: అరుణ్ జైట్లీ

Sunday, February 11th, 2018, 02:20:07 AM IST

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ప్రస్తుతం పార్లమెంట్ లో ఆందోళనలు ఇంకా కొనసాగేలానే ఉన్నాయి. తెలుగు రాష్ట్ర నేతలకు చంద్రబాబు ఇప్పటికే దిశా నిర్దేశాలను ఇచ్చారు. ఏ మాత్రం తగ్గకూడదు అని సమాధానం వచ్చే వరకు నిరసనలను తెలపాలని ఆదేశాలను పంపించారు. ఇక ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ విషయంపై స్పందించి. వీలైనంత త్వరగా సమస్యకు ముగుంపు పలకాలని అరుణ్ జేట్లీ తో అలాగే అమిత్ షాతో కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.
అయితే రీసెంట్ గా తెలుగు నేతల ఆందోళనపై అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఆదుకోవాలని అప్పుడే తాము డిమాండ్ చేశాం. అందులో భాగంగా వారికి కొని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాటిలో కొన్నీ అమలులో ఉన్నాయి. మరికొన్ని ఇంకా అమలు కావాల్సి ఉంది. విభజనలో ఆంధ్రలోని సంస్థలు తెలంగాణకు వెళ్లడంతో కొన్ని సంస్థలను ఏర్పాటు చేశాం. ఏపీ రాజధానికి ఇప్పటికే నిధులను ఇచ్చాము. పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు అందిందేలా చేస్తున్నాం. ఇంకా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అందుతాయి. 2014-15లో తొలిసారిగా రాష్ట్ర విభజన అనంతరం పదినెలలకు సంబంధించిన రెవిన్యూ లోటులో రూ.3,979.50 కోట్లను అందించాం. ఇంకా మొత్తంగా ఇవ్వడడానికి చర్చలు జరుపుతున్నాం. దుగరాజపట్నం పోర్టు పెట్రోలియం క్రాకర్‌ కాంప్లెక్స్‌, విశాఖలో రైల్వేజోన్‌, వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అంశాలపై ఏపీకి న్యాయం చేకూరేలా త్వరలో చర్చలు జరుపుతామని జైట్లీ స్పష్టం చేశారు.