విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం…

Saturday, August 17th, 2019, 12:01:42 AM IST

గత కొంత కాలంగా ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని సమాచారం. కాగా అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందరు కూడా ఎయిమ్స్‌కు చేరుకుని అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్న జైట్లీని ఇటీవల అత్యవసరంగా ఎయిమ్స్‌లో చేర్పించారు. అయితే నేడు కొద్దీ సేపటి క్రితం అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, శ్వాశకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అత్యవసరమైన విభాగంలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్త తెలుసుకున్న బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారని సమాచారం.