దోమల పై యుద్ధం చేయనున్న ముఖ్యమంత్రి !

Monday, September 19th, 2016, 03:12:57 PM IST

Kejriwal
వ‌ర్షాల కార‌ణంగా దేశంలో దోమ‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. ర‌క్తం త్రాగ‌డ‌మే కాదు ప్రాణాల్ని గాల్లో క‌లిపిస్తేస్తున్నాయి. అతి ప్ర‌మ‌దాక‌ర‌మైన డెంగ్యూ పంజాకు ఎవ్వ‌రైనా త‌లొగ్గాల్సిందే. ఆల‌స్యం చేస్తే కాటికి పంపిచేసే భ‌యాన‌క రోగ‌మిది. వీటికి సాధార‌ణ పౌరుడు..ధ‌న‌వంతుడు..రాజ‌కీయ నాయ‌కుడు అంటూ ఎవ‌రూ ఉండరు. ఎవ‌రైనా వాటిపై యుద్ధం చేయాల్సిందేన‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్ర‌త్య‌ర్ధి సైన్యంపై యుద్ధం ఎలా చేస్తామో? దోమ‌ల‌పై కూడా అలా చేయాల్సిందే.

ముఖ్యంగా ఢిల్లీలో ఈ స‌మ‌స్య ఎక్కువ ఉంది కాబ‌ట్టి వాళ్లు త‌ప్ప‌కుండా చేయాలి. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ స‌మ‌యంలో భార‌తీయులంతా ఎలా ఏక‌మ‌వుతారో? అలా ఢిల్లీలో ప్ర‌జ‌లంతా క‌లిసి దోమ‌ల నివారించ‌డానికి చ‌ర్య‌లు తీసుకొండ‌ని కోరారు. చికెన్ గున్యా, డెంగ్యూ, మ‌లేరియా, టైపాయిడ్ వ‌ల్ల ప్ర‌జ‌లు చ‌నిపోతున్నారు. వీట‌న్నింటికీ కార‌ణం దోమ‌లే. ఇప్ప‌టికే ఆరోగ్య శాఖ మంత్రి దోమ‌ల నివార‌ణ‌కు పారింగ్ మెషిన్లు తెప్పించ‌మ‌ని ఆర్డ‌ర్ జారీ చేశాను. అవి మూడు రోజుల్లో స‌మ‌కూరుతాయి. ఈలోపు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.