ఆర్య‌న్ రాజేష్ టాప్ సీక్రెట్స్ లీక్డ్‌

Thursday, September 6th, 2018, 03:54:58 PM IST

అల్ల‌రి న‌రేష్ – ఆర్య‌న్ రాజేష్ బ్ర‌దర్స్ గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఒకేసారి హీరోల‌య్యారు. అయితే ఆర్య‌న్ కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌డుగు వేస్తే, న‌రేష్ మాత్రం వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ 50 సినిమాల్లో న‌టించేశాడు. ఇటీవ‌లి కాలంలో కొన్ని వ‌రుస ఫ్లాప్‌లు న‌రేష్‌ని ఇబ్బందిపెట్టినా వీటి నుంచి బ‌యట‌ప‌డేందుకు సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నిస్తున్నాడు. క‌థ‌ల ఎంపిక‌లో లోప‌మా? లేక స‌న్నివేశాల లోప‌మా? అన్న‌దానిపై న‌రేష్ చాలానే క‌స‌ర‌త్తు చేశాన‌ని చెప్పాడు.

అదంతా అటుంచితే న‌రేష్ ప్ర‌స్తుతం మ‌హేష్ సినిమా మ‌హ‌ర్షిలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మ‌హేష్‌తో క‌లిసి 45 రోజుల షెడ్యూల్లో పాల్గొన్నాడు. మ‌రో 100రోజుల పాటు మ‌హేష్‌తోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. మ‌రోవైపు ఆర్య‌న్ రాజేష్ సైతం రామ్‌చ‌ర‌ణ్‌ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అన్న‌య్య హీరోగా ఫెయిలైనా మంచి న‌టుడిగా బౌన్స్ బ్యాక్ అవుతాడ‌నే భావిస్తున్నాను. రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే త‌న పాత్ర గురించి అడిగితే స‌రిగా చెప్ప‌డు. అస‌లే మాట్లాడ‌డు. చాలా త‌క్కువ మాట్లాడతాడు… అని న‌రేష్ తెలిపాడు. మొత్తానికి అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క్యారెక్ట‌ర్ల‌తో అయినా ఇండ‌స్ట్రీలో కంటిన్యూ అవ్వ‌గ‌ల‌మ‌ని ప్రూవ్ చేస్తున్నారు. న‌రేష్ సైతం త‌న‌కు మంచి పాత్ర‌ల్లో అవ‌కాశాలొస్తే హీరోయేనా అని అలోచించ‌కుండా బిజీ అయిపోతాన‌ని తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments