పచ్చని పొలాలు.. మొక్కజొన్న, చెరుకు తోటలు.. పల్లెటూరు.. 1980ల నాటి వాతావరణం .. ఇన్ని విశేషాలతో `రంగస్థలం` చిత్రం తెరకెక్కింది. సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి ట్రైలర్ తోనే మన్ననలు అందుకున్నాడు. గుబురుగడ్డం చిట్టిబాబుగా రామ్‌చరణ్, అతడి అన్నగా ఆది పినిశెట్టి, పల్లెటూరి అమ్మాయిగా సమంతలను అందంగా చూపించాడు. ట్రైలర్ ఇప్పటికే యూత్‌కి బాగా నచ్చేసింది. వేకువ ఝాముకే ఈ సినిమా టాక్ బయటకు రానుంది.
ఇలాంటి వేళ .. ఇదిగో అచ్చం రంగస్థలం తరహాలోనే ఉన్న వేరొక ట్రైలర్ వెబ్‌ని ఊపేస్తోంది. అక్కడా హీరోకి గుబురుగడ్డం హైలైట్‌గా ఉంది. పైగా అది కూడా బ్రదర్స్ స్టోరీనే అని ట్రైలర్ చెబుతోంది. ఇంతకీ ఏ ట్రైలర్ ఇది అంటే.. `కమ్మర సంభవం`. వివాదాస్పద హీరో దిలీప్, బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటించిన మలయాళ చిత్రమిది. సిద్ధార్థ్ మల్లూవుడ్ డెబ్యూ మూవీ కూడా ఇది. అలాగే పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇదిగో ఇది రంగస్థలం సీక్వెల్ ట్రైలర్ లా ఉందో లేదో… చూస్తే మీకే అసలు సంగతి అర్థమవుతుంది..