ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటున్న ఒవైసీ !

Sunday, June 9th, 2019, 07:58:42 PM IST

తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో మజ్లీస్ పార్టీ దశ తిరిగినట్టైంది. కాంగ్రెస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరడం, ఊతం ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో శాససభలో కాంగ్రెస్ పార్టీకి 6గురు మాత్రమే ఎమెమ్మెల్యేలు మిగిలారు. ఇలా కాంగ్రెస్ శాసనసభా పక్షం తెరాసఎల్పీలో విలీనం కావడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో శాససభలో 7గురు ఎమ్మెల్యేలు ఉన్న మజ్లీస్ పార్టీ రెండో పెద్ద పార్టీగా మారింది.

కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా వారికే దక్కాలి. ఈమేరకు మజ్లీస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శాసనసభలో ప్రతిపక్ష హోదా తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తమ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఢిల్లీ శాసనసభలో 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నలుగురు అభ్యర్థులున్న భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారని గుర్తుచేస్తూ ఆ పద్దతిలోనే తమను కూడా ప్రతిపక్షంగా గుర్తించాలని అంటున్నారు. ఒకవేళ స్పీకర్ అసదుద్దీన్ వినతికి ఆమోదం తెలిపితే మిత్ర పక్షాన్ని ప్రధాన ప్రతిపక్షంగా కలిగిన తెరాస మాటకు సభలో అడ్డు చెప్పే వారే ఉండరు.