గాంధీనే చంపారు, నేనొక లెక్కా…? అసదుద్దీన్ సంచలన వాఖ్యలు…

Friday, August 16th, 2019, 12:12:23 AM IST

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనను అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకేత్తిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు అసదుద్దీన్ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370రద్దు మరియు కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నందుకు ఎదో ఒక రోజు తనని తప్పకుండ చంపేస్తారని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అంతేకాకుండా గాంధీనే చంపిన వారికి ఒవైసీని చంపడం ఓ లెక్కా? అని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మరియు, ఎన్ని రకాలుగా తనని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తన పోరాటం ఆపబోమని అసదుద్దీన్ చాలా ఘాటుగా వాఖ్యానించారు.

అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయజనతా పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా తాను ఇలాగె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అసదుద్దీన్ తెలిపారు. అంతేకాకుండా తనకు సంబందించిన మైనారిటీ వర్గాల కోసం తాను చావడానికైనా వెనుకాడనని అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఇకపోతే జమ్మూకశ్మీర్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఉంటె చాలా బాగుండేదని, ఎవరి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.