16 కోట్లనుకుంటే 29 కోట్లయ్యింది!

Wednesday, September 19th, 2018, 06:00:14 PM IST

అలనాటి అందాల తార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్ ఎంతటి ఘన విజయాన్ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వైజయంతి లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ కు మళ్ళీ బూస్ట్ ఇచ్చిన చిత్రంగా మహానటి ఒక చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అసలు విషయంలోకి వస్తే ఆ సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ కాకుండా మధ్యలో అమాంతంగా పెరిగిందట.

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అశ్వినీదత్ ఈ విషయాన్నీ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహానటి ముందు అనుకున్న బడ్జెట్ వేరు. ఫైనల్ గా అయ్యింది వేరు. ఆ సినిమా ప్లాన్ చేసినప్పుడు మా అమ్మాయి స్వప్నను సినిమా బడ్జెట్ గురించి అడిగినప్పుడు 16-17 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. మహానటి ఆ బడ్జెట్ కరెక్ట్ అని అనుకున్నాం. కానీ సావిత్రి గారి కథ కాబట్టి సెట్స్ మరియు గ్రాఫిక్స్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించినట్లు వివరణ ఇచ్చారు. ఫైనల్ గా 29 కోట్ల వరకు ఖర్చు అయినట్లు అశ్వినీదత్ తెలిపారు. ఇకపోతే సినిమా వరల్డ్ వైడ్ గా 42.08 కోట్ల షేర్స్ ను అందించింది.