తన కొడుకు తప్పు చేసాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే అంటున్న ఓకే పోలీస్

Friday, January 20th, 2017, 01:56:45 PM IST

police-van
తమ పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకొచ్చే తల్లితండ్రులనే చూసాం. ఇలా పిల్లలను వెనకేసుకొచ్చే తల్లితండ్రులు ఎక్కువగా రాజకీయ నాయకులు, పోలీసులలోనే చూస్తాం. కానీ ఒక పోలీస్ అధికారి మాత్రం తన కొడుకు హత్య చేసాడు కాబట్టి అరెస్ట్ చేయాలని కసిగా తిరుగుతున్నాడు. పైగా తన బంధువులు అందరికి తన కొడుకు ఎవరి సాయం కోరినా చేయొద్దని, ఎవరూ అతనికి వసతి కల్పించొద్దని హెచ్చరించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

ఆయన పేరు రాజ్ సింగ్ (52). ఢిల్లీలో ఏఎస్ఐ గా పని చేస్తున్నారు. ఆయన కొడుకు అమిత్ ఒక మహిళను దారుణంగా కత్తితో పొడిచాడు. ఆ కేసుకు సంబంధించి ఆధారాలు దొరక్క పోలీసులు దిక్కుతోచని స్థితిలో ఉన్నపుడు నజఫ్ ఘడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రాజ్ సింగ్ తన కొడుకును అరెస్ట్ చేయడానికి సాయం చేస్తానని ముందుకొచ్చాడు. ఆయన కొడుకు ఒక మహిళను అత్యంత దారుణంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచాడు. రాజ్ సింగ్ బంధువులంతా కొడుకు కాబట్టి అతనిని అరెస్ట్ కాకుండా కాపాడాలని అతనిని కోరారు. దానికి నిరాకరించిన రాజ్ సింగ్ ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని, తన కొడుకుకు ఎవరూ షల్టర్ ఇవ్వొద్దని హెచ్చరించాడు. మొత్తానికి అంతటా గాలించి కొడుకును అరెస్ట్ చేయించి తన నిజాయితీని నిరూపించుకున్నాడు.