భారీ రేటుకు ఎన్టీఆర్ నైజం రైట్స్ .. వాళ్ళ చేతిలోకే ?

Wednesday, September 26th, 2018, 01:23:59 PM IST


నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమా పై రోజు రోజుకు వస్తున్నా కొత్త కొత్త వార్తలతో అంచనాలు తార స్థాయికి చేరుతున్నాయి. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది కాబట్టి తాజాగా బిజినెస్ వర్గాల్లో పోటీ మొదలైంది. ఇప్పటికే ఉత్తరాంధ్రా , కృష్ణా, కర్ణాటక ఏరియా హక్కులను నిర్మాత సాయి కొర్రపాటి క్రేజీ అఫర్ ఇచ్చి మరి తీసుకున్నారట. ఇక మిగతా ఏరియాలకు కూడా భారీ రేటు పలుకుతుందని టాక్. ముక్యంగా నైజం ఏరియా హక్కులను భారీ రేటుకు ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుందట. ఆసియన్ ఫిలిమ్స్ సునీల్ ఈ హక్కులను తీసుకున్నాడని భారీగా విడుదల చేసేందుకు అయన సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. మరో వైపు ఆంధ్రా, సీడెడ్ హక్కుల విషయంలో కూడా గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే ఓవర్ సీస్ హక్కులను 20కోట్లకు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ రేట్ బాలయ్య కెరీర్ లోనే భారీ ప్రైస్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్బంగా విడుదల చేస్తున్నారు.