ఈనెల 26 నుండి అసెంబ్లీ వార్ – వన్ సైడ్ అయ్యేనా…?

Wednesday, June 12th, 2019, 10:54:36 PM IST

నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి… అయితే నేడు కేవలం నేడు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం మరియు స్పీకర్ ఎన్నిక వంటి అంశాలతో నేడు సభ ముగిసింది. కాగా అసలు సిసలైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి… ఈ సమావేశాలు దాదాపు ఇరవై రోజుల పాటు కొనసాగనున్నాయి… ఏపీకి కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన జరగనున్న మొదటి సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ప్రతిపక్షంలో కూర్చోనున్నాడు… గత కొన్ని సంవత్సరాల తరువాత మొదటి సారి అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ సమావేశాలు ప్రారంభించనున్నారు.

కాగా మొదటి సారి జరగనున్న బడ్జెట్ సమావేశాలలో అధికార ప్రతిపక్షాల మధ్య తగ్గ పోరు జరగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో జరిగిన అవినీతిని బయటపెడతామని కొత్తగా ఎన్నికైన వైసీపీ మంత్రులు భీష్మించుకు కూర్చున్నారు. కాగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్యన జరిగినటువంటి దాడులు, అవినీతిపై విచారణ వంటి వంటి అంశాలపై రెండు పార్టీల్లో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరగడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నది చెప్పాలి. అయితే ఈ సమావేశాల్లో టీడీపీ బలం చాలా తక్కువగా ఉండటంతో, వైసీపీ మంత్రులందరూ కూడా టీడీపీ పై విరుచుకుపడే అవకాశం ఉందని, ఈ సమావేశాల్లో టీడీపీ కేవలం ప్రతిపక్ష పాత్ర వహించాల్సి వస్తదని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి…