సీఎం కేసీఆర్‌కి అశ్వత్థామరెడ్డి సరికొత్త సవాల్.. చేయగలరా..!

Sunday, December 15th, 2019, 01:03:31 AM IST

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్‌కి సవాల్ విసిరారు. ఆర్టీసీ విధులలో చేరాక కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. అయితే మహిళల పని వేళల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే సమ్మెలో పాల్గొన్నందుకు కార్మికులతో రెండేళ్ల పాటు యూనియన్లు వద్దంటూ సంతకాలు చేయించుకుంటుండటం సరికాదని అన్నారు. అయితే యూనియన్లు ఉండాలా, వద్దా అనే విషయంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలని అలా చేస్తే కార్మికుల అభిప్రాయాలేంటో తెలిసిపోతుందని, ఆ దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. సితీలో వెయ్యి బస్సులను రద్దు చేయడం దారుణమని, దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటారని అన్నారు.