అప్పట్లోకూడా మాకు డబ్బులు ఎగ్గొట్టిన వారున్నారు : సీనియర్ నటుడు

Saturday, May 19th, 2018, 02:42:24 AM IST


టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలానే కొన్ని చిత్రాల్లో హీరోగా నటించి ప్రస్తుతం చాల వరకు నటనను తగ్గించిన విలక్షణ నటుడు చంద్రమోహన్. ఒకానొక టైం లో ఆయన లేని చిత్రం లేదంటే నమ్మశక్యం కాదు. మంచి కామెడీ హీరోగా ఆయన నటించిన చిత్రాలు అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. అప్పటి ప్రఖ్యాత నటీమణులు శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి వారితో సమానంగా పాత్రల్లో నటించిన ఘనత చంద్రమోహన్ గారిది. మాటలో కొంచెం గరుకుతనం వుండే చంద్రమోహన్, ఏవిషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారు.

అప్పటి నటుల పారితోషికం పై ఆయన ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, అప్పట్లో మాకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కాస్త ఎక్కువగానే ఉండేది. అంటే అప్పట్లో మాకు మూడు వేలు ఇచ్చారంటే అది దాదాపుగా ఇప్పట్లో అయితే మూడు లక్షలతో సమానము అని ఆయన అంటున్నారు. ఇప్పటివలె అప్పట్లో కూడా నిర్మాతలు నటులకు సంబంధించి ఏమాత్రం లోటుపాట్లు రాకుండా చూసుకునేవారన్నారు. కానీ కొందరు నిర్మాతలు, నిర్మాణమే సంస్థలు మాత్రం తమకు రెమ్యూనిరేషన్ ఎగ్గొట్టిన సందర్భాలు లేకపోలేదన్నారు.

మరికొందరైతే సినిమా పూర్తి అయ్యాక ఇస్తామని, లేకేపోతే రిలీజ్ తరువాత రండి ఇస్తాం అనేవారు, కానీ చివరకు మొండి చెయ్యి చూపించేవారన్నారు. ఇంకొన్ని సంస్థలైతే ఏకంగా తమకు చెల్లని చెక్కులు ఇచ్చి ఇబ్బంది పెట్టేవారని, అప్పట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో ఫలానా సంస్థవారు డబ్బులు సమయానికి ఇస్తారా లేదా నిధి తాము ఎప్పుడు ఆలోచించలేదని, వచ్చిన పాత్రలు బయటకి పోకుండా మాత్రం నటించేవాళ్లమని అప్పటి సినీ పరిస్థితులగురించి చెప్పుకొచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments