సాక్షిలో అసత్య కథనాలతో సరిపెట్టుకుంటున్నారు – టీడీపీ ఎమ్మెల్యే!

Friday, February 14th, 2020, 08:15:03 PM IST

చంద్రబాబు నాయుడు ఫై చేస్తున్న ఆరోపణలు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై, సాక్షి వార్త పత్రిక ఫై విమర్శలు చేసారు. జగన్ గారి మెప్పు పొందడం లక్ష్యంగా అసలు ఐటీ శాఖ ఏమి చెప్పిందో తెలుసుకోకుండా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అవినీతి అని అరవడం తప్ప 9 నెలల్లో 9 రూపాయల అవినీతి జరిగిందని నిరూపించలేక సాక్షిలో అసత్య కథనాలతో సరిపెట్టుకుంటున్నారని అన్నారు.

గతంలో వైయస్ కూడా చంద్రబాబు గారిపై అవినీతి మరక అంటించాలని ప్రయతించి 26 ఎంక్వయిరీ కమిటీలు వేసి కోర్ట్ చివాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇపుడు వైసీపీ ఉస్కో బ్యాచ్ తయారైందని విమర్శించారు. జగన్ గారిలా అందరూ అవినీతి పరులే అని ముద్ర వేయడానికి వైసీపీ ప్రజలు కష్టపడుతున్నారని ఘాటుగా విమర్శలు చేసారు. దేశంలో 40 చోట్ల ఐటీ దాడులు జరిగితే 85 లక్షలు దొరికాయని ఐటీ శాఖ అంటుంటే చంద్రబాబు గారి మాజీ పీఎస్ దగ్గర రెండు వేల కోట్లు దొరికాయంటూ కట్టుకథ అల్లిందని అచ్చెన్నాయుడు అన్నారు.