టాలీవుడ్ లో జోరు పెంచిన అతిథి రావు హైదరి?

Saturday, April 28th, 2018, 10:15:11 AM IST

బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ అథితి రావు హైదరి తాజాగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే సుదీర్ బాబు సరసన సమ్మోహనం సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడికి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ – సంకల్ప్ రెడ్డి ల సినిమాలో ఛాన్స్ పట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ఈ అమ్మడు నటించిన సినిమా ఇంకా విడుదల కాకముందే .. వరుసగా అవకష్లు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట. గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకునే ఈ అమ్మడు టాలీవుడ్ లో దుమ్మేయడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.

  •  
  •  
  •  
  •  

Comments