అలాంటి ఛాన్స్ వస్తే మీడబ్బు నాలుగింతలవడం ఖాయం..!!

Thursday, January 19th, 2017, 03:10:56 PM IST

2000rps
ఇలాంటి లక్కీ ఛాన్స్ వస్తే మీడబ్బు నాలుగు రెట్లు పెరుగుతుంది. అలాంటి లక్కీఛాన్స్ ఏంటని అనుకుంటున్నారా.. సరిగా పనిచేయని ఏటీఏంలే. ఏటీఎంలలో సాంకేతిక లోపాల కారణంగా దేశంలోని పలు ఏటీఎం కేంద్రాలలో డబ్బు కుప్పలు తెప్పలుగా పడుతోంది. ఖాతాదారుడు కోరుకున్న మొత్తం కంటే అధిక డబ్బు ని విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరగగా తాజాగా అసోంలోని జమునాముఖ్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.ఆ ఏటీఎంలో ఖాతాదారులు టైప్ చేసిన మొత్తం కంటే నాలుగు రెట్లు అధిక మొత్తాన్ని విడుదల చేసింది.

ఏటీఎం లో రూ 500 నోట్లు, రూ 2000 నోట్లు ఉండగా ఓ ఖాతాదారుడు రూ 1000 కోసం టైపు చేశాడు. సాధారణంగా అయితే రెండు 500 నోట్లు రావాలి. కానీ అలా జరగలేదు. అతడికి ఏటీఎం నుంచి రూ 4000(రెండు 2 వేల నోట్లు) వచ్చింది.ఈ విషయం అధికారులకు తెలిసేలోపు ఏటీఎంలో జనం రూ 7 లక్షలను డ్రా చేసేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ కృష్ణ భౌమిక్ మాట్లాడుతూ ఏటీఎంలో లోపం కారణంగానే ఇలా జరిగిందని అన్నారు. ఈ విషయం పై పోలీస్ లకు సమాచారం అందించినా అధికారికంగా కేసు నమోదు చేయలేదని మేనేజర్ అన్నారు.ఖాతా దారులవి కాని డబ్బుని వారి నుంచి వెనక్కి తీసుకుంటామని భౌమిక్ అన్నారు.