కరీంనగర్ దారుణం : రైతు బజార్ లో వ్యక్తి మృతి – కారణం కరోనా అని ఆందోళన…?

Wednesday, March 25th, 2020, 12:13:31 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా మన దేశ కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలన్నీ కూడా ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నాయి… అయినప్పటికీ కూడా ఈ వైరస్ మాత్రం భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ ప్రబలుతున్న కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ రైతు బజార్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కాగా మార్కెట్ లో ఒక వ్యక్తి గుండెపోటుతో విలవిల్లాడుతూ అక్కడికక్కడే మరణించిన వ్యక్తికి కనీసం సాయం చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు.

కాగా కరీమ్నగర్ లోని కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌కు వచ్చినటువంటి ఒక వ్యక్తికి గుండె పోటు వచ్చి మరణించారు. అయితే ఆ మృతదేహం వద్దకు రావడానికి కూడా స్థానికులు భయంతో వెనకడుగు వేశారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, అతడి కుటుంబానికి సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు అందరు ఈ విషయం పై అక్కడి స్థానిక ప్రజలందరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు. .