ఆడియో టాక్ : ‘భరత్ అనే నేను’…. ఫెంటాస్టిక్ ఆల్బమ్ 

Tuesday, April 10th, 2018, 02:03:20 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కైరా హీరోయిన్  శివ  దర్శకత్వంలో డివివి డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అనే నేను ఆడియో విడుదల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తొలిపాట ది విజన్ ఆఫ్ భరత్ నుండి విడుదలయిన ఐదు పాటలు వేటికవి అద్భుతంగా వున్నాయి అని చెప్పుకోవాలి. ‘భరత్ అనే నేను’ అనే థీమ్ సాంగ్ డేవిడ్ సైమన్ అద్భుతంగా ఆలపించారు, అలానే ‘వచ్చాడయ్యో సామి’ పాటను కైలాష్ ఖేర్, దివ్య కుమార్ తమ గళంతో మంచి ఊపు తీసుకొచ్చారు. ఈ రెండు పాటలు తన కెరీర్ లో ది బెస్ట్ పాటలు అని ఆడియో వేడుకలో మహేష్ చెప్పకనే చెప్పారు. నిజంగా ఆ రెండు పాటలు ఆడియో లో ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇకపోతే ‘ఐ డోంట్ నో’ పాట కూడా చాలా స్టైలిష్ గా, ట్రెండీగా వుంది.
ముఖ్యంగా ఫర్హాన్ అక్తర్ ఆ పాటని చాలా బాగా ఆలపించారు. ఇక ఆండ్రియా ఆలపించిన ‘ఇది కలలా’ వున్నదే పాట హీరోయిన్ ఓరియెంటెడ్ సాంగ్ అని తెలుస్తోంది. ఆమె పాడిన తీరు పాటకు మరింత అందాన్ని తెచ్చింది. ఇక ఆల్బం లో ఆఖరి పాట ‘ఓ వసుమతి’ మంచి డ్యూయెట్ అని తెలుస్తోంది. యాజిన్ నజీర్, రీటా ల గానం పాటకు మరింత కిక్ ఇచ్చింది. మొత్తానికి చూస్తే మహేష్ బాబు, దేవిశ్రీ ప్రసాద్ ల కంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాలలా ఈ సినిమా ఆడియో కూడా చాట్ బస్టర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు…..